Monday, 31 August 2015

స్నేహవనం
స్నేహాల వనం
స్నేహితులం మనం
స్నేహశీలితో పుష్పించే స్నేహ కుసుమాలం
స్నేహామృతమును జువ్వుకునే స్నేహ తుమ్మెదలం
అందరం - మనమందరం స్నేహితులం
ఒకరికొకరం మనమెంతో సన్నిహితులం

అందమైన మనస్సు మనది ఆహ్వానిద్దాం 
ఏదో చెయ్యాలనే తపన ఉంది ప్రోత్సహిద్దాం 
ఎంత బ్రతికినా అది బ్రతుకే కాదు 
చనిపోయాక కూడా బ్రతుకుతూ ఉందాం 
స్వార్ధం లేని తనం  - మన స్నేహ గుణం
గర్వం లేని వైనం - మన స్నేహ బలం 
స్నేహాల కుటుంబం - ఆత్మీయ సమూహం 
స్నేహాల చదరంగం - అది మంచికే ఆరంభం 

ఆహ్లాదాల విందులు పంచే చెలిమై ఉందాం 
ఆనందాల వేడుక తెచ్చే స్వరమై ఉందాం 
కలలెన్నో కంటారు ప్రతి ఒక్కరూ 
ఆ కలల రూపు కోసం ప్రయత్నం చేద్దాం 
చిరాకు లేని తనం - చిరునవ్వే మన సుగుణం 
స్నేహమంటే అర్ధం - మనమే అని చెబుదాం 
స్నేహాల కుటుంబం - సహృదయాల అనుబంధం 
స్నేహాల సంబరం - ఇది ఆశయాల అంబరం 










స్నేహవనం : మినిట్స్ ఆఫ్ మీటింగ్ @1
మన స్నేహవనంలో సుగంధ పరిమళాలను వెదజల్లాలని పుష్పించే స్నేహమనస్సులను సవినయంగా ఆహ్వానిస్తూ అందరికీ మనస్సుమాంజలి . ఈరోజు మన స్నేహవన మిత్రులు వారి వారి స్నేహగుణాలను పరిచయం చేసుకుంటూ ,స్నేహబలాన్ని పెంపొందించాలని ఏర్పాటు చేసుకున్న సమావేశములోని ముఖ్యాంశాలు మన అందరికోసం , మన ఆశయ సాధన కోసం ఒక మారు మన సమావేశం లోని  చర్చలను క్లుప్తంగా ఇలా :-

ముందుగా
1) శ్రీ ద్విభాష్యం వెంకటేశ్వర్లు గారు :-